ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న వినతులను సమస్య -మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి పరిష్కారిస్తున్నాం -
ప్రజావాణి కార్యక్రమంలో 430 దరఖాస్తులు
ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న వినతులను సమస్య పరిష్కారిస్తున్నాం -
మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి పాల్గొన్నారు.
ప్రజల నుండి వివిధ సమస్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య వినతులు స్వీకరించారు.
పలు సమస్యల పై అధికారులతో మాట్లాడి వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, దివ్య పరిష్కరించారు.
ప్రజా పాలనలో తమ ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకే వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి వివరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న వినతులు సమస్య పరిష్కారం త్వరితగతిన జరగాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల జిల్లాలో తమ పై అక్రమంగా నమోదైన కేసులపై మహిళ ప్రజావాణిలో చెప్పగా వెంటనే సిరిసిల్ల ఎస్పీ తో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడి, పరిష్కరించాల్సిందిగా సూచించారు
బోధన్, మెదక్, మెట్ పల్లి నిజాం షుగర్ కర్మగారాలలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలను ఇప్పించాలని కోరుతూ ప్రజావాణిలో కార్మికులు అర్జీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి త్వరలోనే జీతాల సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని చిన్నారెడ్డి, దివ్య హామీనిచ్చారు.
# బేగంపేట్, అమీర్ పేట్ సహా పలు ప్రాంతాల్లోని హాకర్స్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చిన్నారెడ్డి, దివ్య తెలిపారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారుల నుంచి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని హాకర్స్ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు.
# 61 సంవత్సరాల వయస్సు నిండిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరలోనే పరిష్కార మార్గం చూస్తుందని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చిన్నారెడ్డి, దివ్య భరోసా ఇచ్చారు.
# తార్నాక, కవాడిగూడ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు మహిళలు తమకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరగా, వారి ప్రత్యేకతలు గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చిన్నారెడ్డి, దివ్య భరోసా ఇచ్చారు.
ప్రజావాణి కార్యక్రమంలో 430 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 430 దరఖాస్తులు అందాయి.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి 114 , మైనారిటీ సంక్షేమ శాఖకు 126, విద్యుత్ శాఖకు 54, రెవెన్యూ శాఖకు 46, హోం శాఖకు 20 , ఇతర శాఖలకు 70 దరఖాస్తులు అందాయి. ప్రజావాణి కార్యక్రమం ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.