మండలంలో భూ ప్రకంపనలు - భయాందోళనలో ప్రజలు

ఒకటి నుండి రెండు సెకండ్ల పాటు వస్తువుల కదలికలు 

On
మండలంలో భూ ప్రకంపనలు - భయాందోళనలో ప్రజలు

భీమదేవరపల్లి డిసెంబర్ 03 (ప్రజామంటలు) :

మండలంలోని ములుకనూర్, ముత్తారం గ్రామాల్లో అందిన సమాచారం మేరకు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలియజేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఒకటి నుండి రెండు సెకండ్ల పాటు టీవీ, కిచెన్ సామాగ్రి, గోడలు కన్నుమూసి తెరిచేలోపు కదిలినట్లు ప్రత్యక్ష సాక్షులు ప్రజా మంటలు ప్రతినిధికి ఫోన్ చేసి వివరించారు. వాస్తవ వివరాల్లోకి వెళితే దక్కన్ పీఠభూమి ప్రాంతం భూకంపాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆధునిక మానవ జీవితంలో చేసిన తప్పిదాల కారణంగా సింగరేణి గనులు, ఓపెన్ కాస్ట్ గనులు, అడవుల నరికివేతతో పాటు సహజ వనరుల సంక్షోభంతో భూమి తీవ్ర క్రమక్షాయానికి గురైనది. ఇది టీవీ వార్తల్లో అందిన సమాచారం మేరకు స్వల్ప భూకంపముగా రిక్టర్ స్కేల్ పై నమోదయినట్లు తెలుస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో పాలు సెకండ్ల పాటు భూమి కనిపించిందని వార్తలు వస్తున్నాయి దీంతో ప్రజలు భయంతో ఇల్లు అపార్ట్మెంట్స్ వదిలి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఏమైనా ఇప్పటికైనా ప్రజలు కాలుష్య నివారణతో పాటు సహజ వనరులను కాపాడుకుంటేనే మానవ మనుగడ మరికొద్ది రోజులు కొనసాగుతుందని నిపుణుల అభిప్రాయం.

Tags