జగిత్యాలలో బైండోవర్ ఉల్లంగిచడంతో లక్ష జరిమానా విధింపు

On
జగిత్యాలలో బైండోవర్ ఉల్లంగిచడంతో లక్ష జరిమానా విధింపు

జగిత్యాలలో బైండోవర్ ఉల్లంగిచడంతో లక్ష జరిమానా విధింపు

గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):

జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో నాటుసారా అమ్ముతూ పట్టుబడిన ఇదునూరి చందు పై కేసు నమోదు చేసి తహసీల్దార్ ముందర ఒక సంవత్సర కాలానికి లక్ష రూపాయలకు బైండోవర్ చేయగా, అతను బైండోవర్ ను అతిక్రమిస్తు మళ్ళీ గుడుంబా అమ్మడంతో అతనిపై కేసు నమోదు చేసి జగిత్యాల రూరల్ తహసీల్దార్ ముందర హాజరు పరచడంతో అతనికి 1,00,000 (లక్ష రూపాయలు) జరిమానా విధించడం తో ఈరోజు ఇదునూరి చందు లక్ష రూపాయలు చలానా కట్టి ఆ రసీదు ను ఎక్సైజ్ సీఐ సర్వేష్ కు  అందించారు.ఈ సందర్భంగా జగిత్యాల అబ్కారీ సీఐ సర్వేష్ మాట్లాడుతూ జగిత్యాల స్టేషన్ పరిధిలో ఎవరైనా నాటుసారా తయారు చెయ్యడం, అమ్మడం,రవాణా చెయ్యడం  నాటుసారా ముడిసరుకు కలిగి ఉన్నట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags