మహిళల ఓట్లువేయించుకొని, వారినే మరిచారు..
కాంగ్రెస్ సర్కార్ కు ఇక కౌంట్ డౌన్ షురూ అయింది... * బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ
మహిళల ఓట్లువేయించుకొని, వారినే మరిచారు..
* కాంగ్రెస్ సర్కార్ కు ఇక కౌంట్ డౌన్ షురూ అయింది...
* బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ
సికింద్రాబాద్ నవంబర్ 05 (ప్రజామంటలు):
ఎన్నికల్లో మహిళలను నమ్మించి, ఓట్టు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తీరా అధికారంలోకి వచ్చాకా మహిళల సంక్షేమాన్ని పూర్తిగా మరిచిపోయారని సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ అన్నారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ర్టంలోని పేద, మద్య తరగతి మహిళలకు ప్రతినెలా రూ 2500 లను మహాలక్ష్మీ పథకం పేరుతో ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నీటి మీద రాతగా మిగిలిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఇంకా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. మహిళలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎన్నో రోజులు అధికారంలో ఉండబోదన్నారు. మహిళలను మోసపుచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కు ఇక కౌంట్ డౌన్ మొదలైనట్లేనని అన్నారు. హైడ్రా పేరుతో సిటీలో రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని, దాంతో రియల్ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది వేతన జీవులు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. ఒక విజన్ అంటూ లేని అసమర్థత ప్రభుత్వానికి ఇక చరమగీతం పాడాలన్నారు. త్వరలోనే పేదల ఆశాజ్యోతీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్, రాజేశ్, బాబా, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
––––––––––––––
–ఫొటో: