ఉద్యోగులు, పింఛనుదారులకు ఊరట.- హరి ఆశోక్ కుమార్,రాష్ట్ర కార్యదర్శి,తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 99633499493/9348422113).
జగిత్యాల నవంబర్ 9( ప్రజా మంటలు) :
ఉద్యోగుల,పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించాలని సర్కారు నిర్ణయించడం పట్ల తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
శనివారం అసోసియేషన్ కార్యాలయంలో హరి ఆశోక్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.... ఆన్‌లైన్ చేయడం వల్ల రోజుల వ్యవధిలోనే స్ర్కూట్నీ ప్రక్రియ పూర్తయి, వేగంగా నగదు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల స్ర్కూట్నీ బాధ్యతలను డీఎంఈ నుంచి తప్పించి.. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు అప్పగించాలని కోరుతున్నామన్నారు. తద్వారా మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం ఏడాది నుంచి రెండేళ్ల దాకా ఆగాల్సిన అవసరం తప్పడంతోపాటు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఊరట దక్కనుందని హరి ఆశోక్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విష్వనాథం, సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు వి.ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,తదితరులు పాల్గొన్నారు.