విజయవంతంగా పూర్తయిన ఉచిత కంటి ఆపరేషన్లు
విజయవంతంగా పూర్తయిన ఉచిత కంటి ఆపరేషన్లు
గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, భీమ్ రాజ్ పల్లి బొమ్మన కుమార్ ( బీబీకే) సౌజన్యంతో, రేకుర్తి కంటి ఆసుపత్రి చైర్మన్ లయన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో శుక్రవారం భీమ్ రాజ్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ కంటి వైద్య శిబిరానికి వివిధ గ్రామాల నుంచి నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులు శిబిరానికి రాగా 70 మందిని పరీక్షించగా 30 మందిని కంటి ఆపరేషన్ కోసం గుర్తించారు. వీరిలో 27 మందికి కంటి వైద్యులు ఆపరేషన్ నిర్వహించగా విజయవంతంగా పూర్తయింది.వీరినిలయన్స్ క్లబ్,రేకుర్తి కంటి ఆసుపత్రి వారు తిరిగి అదే గ్రామానికి బస్సులో పేషంట్లను తీసుకువచ్చి దింపారు.కంటి ఆపరేషన్ చేయించుకున్న వారు లయన్స్ క్లబ్ , బి బి కే నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్లు విజయవంతం కావడం పట్ల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బొమ్మెన కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు ముస్కు కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మెన కుమార్,కార్యదర్శి సాయిని నరహరి, పాల్గొన్నారు