రెయిన్ వాటర్ సంప్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెయిన్ వాటర్ సంప్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 02:
రాజ్‌భవన్ రోడ్డు మార్గంలో లేక్‌వ్యూ అతిథి గృహం వద్ద వరద నియంత్రణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు చిన్నపాటి వరదొచ్చినా నగరంలో చాలాచోట్ల రోడ్లు జలమమమై ట్రాఫిక్‌తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా, గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వెంటవెంటనే నీరు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి గతంలో ఆదేశించారు.
ఆ పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్లా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెయిన్ వాటర్ సంప్‌ల డిజైన్‌లో అవసరమైన మార్పులను అధికారులకు సూచించారు. ఈ పనుల పరిశీలన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.