ఏడాది కాలంలో ఎంతో సాధించాం - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
ఏడాది కాలంలో ఎంతో సాధించాం
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి డిసెంబర్ 02:
రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఎంతో సాధించామని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం
ధర్మపురి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...
ఈ నెల 4వ తేదిన పెద్దపెల్లిలో మధ్యాహ్నం 2 గంటలకు యువ వికాస్ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతిపై సమగ్ర సమాచారం ప్రజలు తెలియ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని కోరారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తమ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలను ఇవ్వడం,
2 లక్షల లోపు ఉన్న రుణాలను కూడా మాఫీ చేయడం, రైతు రుణమాఫీ కింద మొత్తంగా సుమారు 20 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఋణమాఫీ కానివారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
ఎక్కడైనా రైతులు వచ్చి వడ్ల కొనుగోలు విషయంలో ఇబ్బంది ఉందని చెప్పిన దాఖలాలు లేకుండా
,ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ఒక స్పెషల్ ఆఫీసర్ నీ నియమించి వడ్లను కొనుగోలు చేయించడం జరిగిందన్నారు.
జగిత్యాల జిల్లాకు సంబంధించి 72 వేల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది.ఇతర సాంకేతిక కారణాల వల్ల సుమారు 19 వేల మందికి రుణమాఫీ కాలేదని ,వాటికి సంబంధించి కూడా రుణాలు మాఫీ చేస్తామాన్నారు.
ప్రజా పాలన
విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 7 వ తేదిన ధర్మపురిలో నంది చౌరస్తా వద్ద సభను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
గతంలో సాధ్యం కాదని భావించిన నైట్ కాలేజీని తిరిగి ప్రారంభించామని, చెగ్యాం భూ నిర్వాసితులకు వారి పరిహారం 18 కోట్లు అందించామన్నారు. సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహించిన కొప్పుల ఈశ్వర్ గురుకుల పాఠశాలకు పక్క భవనాలు నిర్మించలేని పరిస్థితి ఉంటే, తాము 100కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీయల్ భవనాలను నియోజకవర్గానికి మంజూరు చేయించి, నిర్మాణానికి 25 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగిందన్నారు.
గోదావరి జలాలను వినియోగించి లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే తీసుకోవాలని ఉత్తం కుమార్ రెడ్డి గారిని కలిసి విన్నవించడం జరిగిందని, నవోదయ పాఠశాల
నియోజక వర్గంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు
ఒక 50 పడకలతో ట్రామా
ఆసుపత్రి నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు.
ధర్మపురి నియోజకవర్గానికి సుమారు 20 కోట్ల రూపాయలను NREGS గ్రాంట్ ద్వారా, CRR గ్రాంట్ నుండి సుమారు 15 కోట్లకు పైగా రూపాయలను,TFIDC నిధుల ద్వారా మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని వివరించారు.
పీసీసీ సభ్యులు దినేష్, మార్కెట్ వైస్ చైర్మన్ నర్సింలు, నాయకులు లక్ష్మణ్, వేముల రాజేశ్, చేపిరిశెట్టి రాజేశ్,
సుధాకర్, సత్యనారాయణ, మొగిలి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.