బి అర్ ఎస్ జిల్లా అధ్యక్షుని ఆరోపణలను ఖండించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

On
బి అర్ ఎస్ జిల్లా అధ్యక్షుని ఆరోపణలను ఖండించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

బి అర్ ఎస్ జిల్లా అధ్యక్షుని ఆరోపణలను ఖండించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

ధర్మపురి నవంబర్ 10:

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ధర్మపురి లో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం లో బియర్ఎస్ నాయకుల ఆరోపణలను ఖండించారు. 

కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు  మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పై చేసిన అసత్యపు ఆరోపణలను  ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు.

2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశారో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని,జగిత్యాల జిల్లాకు వారి గత ప్రభుత్వ హయంలో ఏం మేలు చేశారని కేటీఆర్ జిల్లాకు వస్తున్నారని,
2014 నుండి 2023 వరకు గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు ఏం చేశారో జవాబు చెప్పి పాదయాత్రను మొదలు పెట్టాలని లక్ష్మణ్ సూచించారు.

ఇంకా ఇలా అన్నారు.మీ ప్రభుత్వ హయంలో మిల్లర్లు కటింగ్ పేరిట రైతులను దోచుకుంటుంటే కనీసం స్పందించని మీరు,రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించనీ మీరు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా

రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువెత్తున దోచుకున్నారు.మా ప్రభుత్వంలో జిల్లాకు చెందిన సుమారు 65 వేల మంది రైతులకు 2 లక్షల రూపాయల మేర రుణాలు మాఫీ చేశాం
మా ప్రభుత్వం వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే అయింది, ఈ కొద్ది సమయంలోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,500 కి  గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్,2 లక్షల రుణమాఫీ,ఉద్యోగస్తులకు నియామక ఉత్తర్వులు పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు అమలు చేసి చూపించాం.త్వరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా పంపిణీ చేస్తాం
ఇన్ని సంక్షేమ పథకాలకు అమలు చేస్తే బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం మా పైన అసత్యాలను ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని నిజం అని పలు మార్లు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కేవలం బి.ఆర్.ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి ఒక బూటకపు పాదయాత్రలు చేయడం జరుగుతుంది.వారు ఎన్ని పాదయాత్రను చేసిన వారి మాటలు రైతులు గాని, ప్రజలు గాని నమ్మే పరిస్థితి లేదు అన్నారు

Tags