టింబర్ డిపో కాలుష్యంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు - ప్రజావాణిలో ఫిర్యాదు

On
టింబర్ డిపో కాలుష్యంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు - ప్రజావాణిలో ఫిర్యాదు

టింబర్ డిపో కాలుష్యంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు - ప్రజావాణిలో ఫిర్యాదు

సికింద్రాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):

బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడ సున్నం బట్టి ప్రాంతంలోని గౌతమ్ టింబర్ డిపో  నల్లటి పొగ తో ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో సికింద్రా బాద్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు వినతిపత్రం సమర్పించారు టింబర్ డిపో నల్లని పొగ గొట్టం నుంచి వస్తున్న కాలుష్యంతో స్థానికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు ఈ సమస్యను తీర్చి తమను ఆదుకోవాలని వారు అధికారులను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి, మోహన్ కృష్ణ, మధుర వీరన్, ప్రవీణ్, సున్నం బట్టి ప్రాంతవాసులు పాల్గొన్నారు.
--------------

Tags