ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు

On
ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు

 ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు

మెదక్ డిసెంబర్ 03:

ఆర్టీసీ బస్సు నుంచి జారి బస్సు వెనుక చక్రం కింద పడడంతో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బోడ అఖిల(16) అనే విద్యార్థిని కింద పడింది. ఆమె కింద పడగా బస్సు వెనుక చక్రం అఖిల కాలుపై నుండి వెళ్ళింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి.

Tags