వైద్యపరంగా దివ్యాంగులకు అండగా గాంధీ ఆసుపత్రి
వైద్యపరంగా దివ్యాంగులకు అండగా గాంధీ ఆసుపత్రి
సికింద్రాబాద్ డిసెంబర్ 03 (ప్రజామంటలు) :
వైద్య పరంగా పలు రకాల అరుదైన సర్జరీలను చేసి, దివ్యాంగులకు కొత్త జీవితాన్ని ఇచ్చి వారికి అండగా నిలిచామని గాంధీ ఆసుపత్రి వైద్యులు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా గాంధీ ఆసుపత్రి ఆర్ధోపెడిక్ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ డా.బి.వాల్యా ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్లకు అవెర్నెస్ క్యాంపు నిర్వహించారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, వైస్ ప్రిన్సిపాల్ డా.రవిశేఖర్ రావు, గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి హాజరై, సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో అందిస్తున్న సర్జరీల వివరాలు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న శారీరక, అనారోగ్య సమస్యల గురించి డాక్టర్ వాల్యా, ఇతర వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ద్వారా వివరించారు. దివ్యాంగులపై కేవలం సానుభూతి చూపడమే కాకుండా, వారికి చేయూత అందించి, అన్ని రంగాల్లో వారిని ప్రొత్సహిస్తూ, అండగా నిలబడాలని కోరారు. ఆర్దోపెడిక్ ప్రొఫెసర్ బి.శ్రీనివాస్, ఉస్మానియా ఆసుపత్రి ఆర్దోపెడిక్ హెచ్ఓడీ డా.పీఎల్ శ్రీనివాస్, డా.బన్సీలాల్, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రకాశ్ రాథోడ్ లు పాల్గొన్నారు.