ఘనంగా శివ పంచాయతన హనుమాన్ విగ్రహాల శోభ యాత్ర.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 2 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని ఉప్పరి పేటలో పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం మరియు 11, 12 వార్డు ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో శివపంచాయతన హనుమాన్ ప్రతిష్ట కార్యక్రమము సోమవారం నుండి ప్రారంభం కాగా విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ఉంచి మంగళ వాద్యాలు, మంగళహారతులతో స్థానిక మంచినీళ్ల భావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం నుండి శోభాయాత్రగా తీసుకువెళ్లారు.
సోమవారం ఉదకశాంతితో వైదిక కార్యక్రమం ప్రారంభం కాగా మంగళవారం గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము ,దీక్ష స్వీకారము, దేవత ఆరాధన నిర్వహించ నున్నారు.
వైదిక క్రతువులు 6వ తేదీ వరకు కొనసాగును.
అదే రోజు విగ్రహ ప్రతిష్ట నిర్వహించబడును. సోమవారం శోభాయాత్రలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని మంగళహారత్రతో పాటు కోలాటాలు నిర్వహిస్తూ శోభాయాత్రను నూతన ఆలయం వరకు కొనసాగించారు.