మౌలానా అబుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శం - ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్.

On
మౌలానా అబుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శం - ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు) : 

మౌలానా అబుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.

జిల్లా కేంద్రంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యానగర్ లో భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్య దినోత్సవం, మైనార్టీ వెల్ఫేర్ దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని, వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి,రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి,విద్యార్థులు,మైనార్టీ నాయకులతో కలిసి సహా పంక్తి భోజనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే మాట్లాడుతూ....మౌలానా అబుల్ కలామ్ జీవితం అందరికీ ఆదర్షనీయం అన్నారు.

మైనార్టీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ర్యాంక్ లు సాదించడం అభినందనీయమన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలలో,గురుకులాల్లో నాణ్యమైన విద్య కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని కుల మత రహిత రాష్ట్ర సాదనే లక్ష్యం గా మైనార్టీ గురుకులాల్లో నాన్ మైనార్టీ లకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాం అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువు తో పాటు సంస్కారం అలవడుతుందని,తాను ప్రభుత్వ పాఠశాల విధ్యర్థినేనని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో డైట్ చార్జీలు పెంచారని,విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి చిత్రు నాయక్ ,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ బద్దం లత జగన్,మైనార్టీ వెల్ఫేర్ సూపరిండెంట్ మహమూద్ అలి అఫ్సర్, ఆర్ ఎల్ సి దాసరి రాజేందర్ ,ప్రిన్సిపాల్ మహేందర్,కౌన్సిలర్ లు కుసరి అనిల్,బోడ్ల జగదీష్,కమాల్, పంబాల రాం కుమార్,నాయకులు ప్రబాత్ సింగ్ ఠాగూర్,

వంశీ,రామకృష్ణ,తిరుపతి,మహేష్,కళాశాలసిబ్బంది,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Tags