సర్వే పేరిట ఒంటి పూట బడులు సరి కాదు
స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు మచ్చ శంకర్
సర్వే పేరిట ఒంటి పూట బడులు సరి కాదు
- స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు మచ్చ శంకర్
గొల్లపల్లి నవంబర్ 05 (ప్రజా మంటలు):
కుల గణన సర్వే పేరిట 13 రోజులు ఒంటిపూట బడులు నడపడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లె ప్రమాదం ఉందని ఎస్టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్,
బైరం హరికిరణ్ పేర్కొన్నారు.
మంగళవారం గొల్లపల్లి మండలంలో స్టేట్ టీచర్స్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వివిధ పాఠశాలలో జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ కులగణన సర్వేలో కేవలం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం వల్ల ఒంటిపూట నడపాలనే నిబంధనతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాథమిక
పాఠశాలలను పూర్తిగా మూసి వేయకుండా సగం మంది ఉపాధ్యాయులు ఉదయం , సగం మంది మధ్యాహ్నం సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులను సైతం ప్రజలుగా భావించి వారికి న్యాయంగా రావాల్సిన పెండింగ్ డిఏలు , మెడికల్, జి పి ఎఫ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాస్, గుండెల నరేష్ తదితరులు ఉన్నారు..