కాంగ్రెస్ హయంలోని అభివృద్ధిని చూడలేని కబోధి హరీష్ రావు - డిపెండెంట్ లీడర్ సంజయ్
-కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్
కాంగ్రెస్ హయంలోని అభివృద్ధిని చూడలేని కబోధి హరీష్ రావు - డిపెండెంట్ లీడర్ సంజయ్
-కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు): జిల్లా కేంద్రం లోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ,
హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిని చూడలేని హరీష్ రావు లానిటి విమర్శలు అరథ్ం లేనివని అన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. ధాన్యం సేకరణలో గత ఖరీఫ్ కంటే ముందంజలో ఉన్నామని, గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందనీ,ప్రభుత్వం మూసి ప్రక్షాళన అవశ్యకతను గుర్తించి మూసి ప్రక్షాళన మొదలు పెట్టారనీ మూసి ప్రక్షాళనలో నిర్వసితులకు న్యాయం చేసిన తర్వాతే మూసి ప్రక్షాళన మొదలు పెడుతామని ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీ మాఫీగానే,మిగిలిపోయిందనీ,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక ఏక కాలం లో 18వేల కోట్లతో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని రుణమాఫీ కాని రైతులకు ఈ నేల చివరి లో పూర్తిగా రుణమాఫీ చేస్తామని తెలిపారు.
డిపెండెంట్ లీడర్ సంజయ్ ,హరీష్ రావుతో పాదయాత్ర చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సాంకేతిక కారణాల తో రైతు రుణమాఫీ లో కొంత జాప్యం జరిగిందనీ, రుణమాఫీ కాని రైతుల సమస్య గురించి సీఎం దృష్టికి తీసుకెళ్ళాడం జరిగిందని,హరీష్ రావు ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని, జిల్లాకు చెందిన 65 వేల కుటుంబలకు రుణమాఫీ చేసామని అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతు నైన పరామర్శించారాని ప్రశ్నించారు. డబ్బుల సంచుల సంస్కృతి మాది కాదు అని మీది మీ మామ కెసిఆర్ ది అని,ధర్మపురి లో పూజలు,యాగాలు చేసి 500 కోట్లు కేటాయిస్తాను అని చెప్పిన కేసీఆర్ అన్న మాట ఏమైందని,ధర్మపురి అభివృద్ధి ఎక్కడ జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు..