నర్సింగ్ విద్యార్థినుల డ్రైనేజీ కష్టాలు... * ఉప్పొంగిన నర్సింగ్ స్కూల్​, కాలేజీ వాష్​ రూమ్​ ల డ్రైనేజీ

On
నర్సింగ్ విద్యార్థినుల డ్రైనేజీ కష్టాలు... * ఉప్పొంగిన నర్సింగ్ స్కూల్​, కాలేజీ వాష్​ రూమ్​ ల డ్రైనేజీ

నర్సింగ్ విద్యార్థినుల డ్రైనేజీ కష్టాలు...
* ఉప్పొంగిన నర్సింగ్ స్కూల్​, కాలేజీ వాష్​ రూమ్​ ల డ్రైనేజీ
* టాయిలెట్స్​ కు తాళాలు
* గాంధీ ఆసుపత్రి వద్ద నర్సింగ్​ విద్యార్థినుల ఆందోళన

సికింద్రాబాద్​ నవంబర్​ 07 (ప్రజామంటలు) :

బోయిగూడ లోని సికింద్రాబాద్​ ప్రభుత్వ నర్సింగ్​ కాలేజీ, గాంధీ నర్సింగ్​ స్కూల్​ భవనాలకు సంబందించిన కామన్​ టాయిలెట్స్​ కు చెందిన డ్రైనేజీ బ్లాక్​ అయి, ఉప్పొంగిపోవడంతో, టాయిలెట్స్​ కు తాళాలు వేశారు. వివరాలు ఇవి...బోయిగూడ లో 1978 లో గాంధీ నర్సింగ్​ స్కూల్​ భవనాన్ని నిర్మించారు. అప్పుడు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థకు  కాలం చెల్లిపోవడంతో గత కొన్నేండ్లుగా తరచుగా డ్రైనేజీ సమస్యలు వస్తుండగా, తాత్కలికంగా రిపేర్లు చేయిస్తున్న అధికారులు శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే నర్సింగ్ స్కూల్​ భవనంలో 2019 లో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. 2020 లో గాంధీ ఆసుపత్రిలోని నర్సింగ్ స్కూల్​ ను కోవిడ్​ సమస్య కారణంగా బోయిగూడ కాలేజీ భవనంలోకి తరలించారు. నర్సింగ్​ కాలేజీ, స్కూల్​ భవనాలకు ఓ పక్కన జీహెచ్​ఎమ్​సీ మల్టీపర్పస్​ పంక్షన్​ హాల్​, మరో పక్క ముదిరాజ్​ భవనాలు ఉన్నాయి. దాంతో ఈ రెండు హాల్​ల్లో ఫంక్షన్​ జరిగినప్పుడల్లా నర్సింగ్​ భవనంలో డ్రైనేజీ ఉప్పొంగి, కారిడర్​, గదుల్లోకి డ్రైనేజీ నీరు వస్తోంది. ఈ క్రమంలో కాలేజీ అద్యాపకులు డీఎంఈకి సమస్య గురించి ఫిర్యాదు కూడ చేశారు. టీజీఎమ్​ఎస్​ఐడీసీ ఇంజనీరింగ్​ అధికారులు వచ్చి రూ 45 లక్షలకు డ్రైనేజీ నిర్మాణ పనులకు అంచనా వేసి, ప్రతిపాదనలు సిద్దం చేశారు. నిధుల మంజూరీ రాగానే టెండర్​ ప్రక్రియ ప్రారంభించి, పనులు చేస్తామంటున్నారు. 

టాయిలెట్స్​ కు తాళాలు:

గత మూడు రోజుల నుంచి నర్సింగ్​ కాలేజీ, స్కూల్​ భవన టాయిలెట్స్​ డ్రైనేజీ నిండిపోయి, మురికినీరు గదుల్లోకి రావడంతో టాయిలెట్స్​ కు తాళాలు వేశారు. దాంతో విద్యార్థినులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారుల సూచనతో 300 మంది నర్సింగ్​ కాలేజీ విద్యార్థినులు హాస్టల్​ భవనం విడిచివెళ్ళారు. బయట వీరు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లుచేసుకున్నారు. ఇక మిగిలిన 150 మంది గాంధీ నర్సింగ్​ స్కూల్​ విద్యార్థినులు టాయిలెట్స్​ కు తాళాలు వేయడంతో గురువారం గాంధీ ఆసుపత్రికి వచ్చి, ఆందోళన నిర్వహించారు. సెక్యూరిటీ సిబ్బంది వీరిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.  సూపరింటెండెంట్​ ప్రొఫెసర్​ రాజకుమారిని కలిసి, తమ సమస్యను మొరపెట్టుకున్నారు. గతంలో మాదిరిగా గాంధీ మెయిన్​ బిల్డింగ్​ ఎనిమిదో ఫ్లోర్​ లో 8 గదులను నర్సింగ్ స్కూల్​ విద్యార్థినుల వసతి కి ఇస్తామని అంగీకరించారు. ఈమేరకు సిబ్బంది గదుల శుభ్రం చేసే పనులు  ప్రారంభించారు. శుక్రవారం 8వ ఫ్లోర్​ లో గదులను నర్సింగ్ స్టూడెంట్స్ కు ఇవ్వనున్నారు.మరో పదిరోజుల్లో నర్సింగ్​ పరీక్షలు ఉన్నందున సెలవులు ఇవ్వలేమని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూపరింటెండెంట్​ సూచించారు.
––––––––––––
–ఫొటోలు:: 
1.  బోయిగూడలోని నర్సింగ్​ స్కూల్​, కాలేజీ భవనం
2:  గాంధీలో ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్​ తో సూపరింటెండెంట్​

Tags