ప్రియాంక గాంధీ గెలుపు యావత్ భారతదేశం హర్షిస్తుంది. - పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
-జార్ఖండ్ గెలుపు, ప్రియాంక ఘన విజయం పై మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు) :
రాహుల్ కు తోడుగా, అండగా నిలిచేందుకు వయనాడ్ నుంచి4లక్షల పై చిలుకు అత్యధిక మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలుపొందడం, కేవలం కాంగ్రెస్ పార్టీయే కాకుండా యావత్ భారతావనే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండడం సంతోషకరమని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జిల్లా కేం ద్రంలోని స్థానిక తహశీల్ చౌరస్తా వద్ద జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి గెలుపు, ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలవడంపై జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యం లో సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ..... వాస్తవంగా కేవలం అధికారం అనేది ప్రధానం కాకుండా ఈ దేశ సమగ్రత, సమైక్యత ప్రధానమైందిగా భావించి, స్వర్గీయ ఇందిరాగాంధీ తన ప్రాణాలు త్యాగం చేసి మార్గదర్శకురాలు అయితే, ప్రపంచ శాంతిని కాంక్షించిన స్వర్గీయ రాజీవ్ గాంధీ శ్రీలంకలో శాంతిని నెలకొల్పేందుకు తన ప్రాణాలు సైతం వదిలేశారని గుర్తు చేశారు.
దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రాణాల అర్పించిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల ఆత్మకు శాంతి చేకూరేలా, దేశ సమగ్రత కాపాడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతని చాటి చెప్పాలనే భావనతో, యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిందన్నారు.
ఈ పదేళ్ల కాలంలో సోనియా గాంధీ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపబడే విధంగా కృషి చేసిందన్నారు. దేశంలో రైతాంగం, రైతుకూలీల సంక్షేమం కోసం పాటు పడి, దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీకే దక్కిందన్నారు.
గ్రామీణ నిరుపేద వర్గాలైన కూలీలకు పని కల్పించేందుకు ఉపాధిహామి పథకం, పారదర్శతక కోసం సమాచార హక్కు చట్టం, పేదోడికి పట్టెడన్నం పెట్టేందుకు ఆహరభద్రత చట్టంతో దేశాన్ని ముందుకు తీసుకెల్లారని గుర్తుచేశారు.
మధ్యలో అధికారం లోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడమే తన అధికార కాంక్షకు ప్రతీకగా మోదీ వ్యవహరిస్తున్న తీరును పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు.
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుపు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికగా తాము భావించడం లేదన్నారు. అదానీ పెట్టుబడులతో మోదీ ఓటర్లను ప్రభావపెట్టి గెలిచారే తప్ప, ప్రజాస్వామ్యయుతంగా జరగలేదన్నారు.
ప్రపంచ నేరస్తునిగా గుర్తింపబడున్న అదానీకి అమెరికా దేశం సెర్చ్ వారెంటు జారీ చేసి, దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మోదీ బాధ్యత వహించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. భారత ప్రధాని మోదీ అంబానీ, అదానీ అండదండలతో రాజ్యం ఏలాలని చేసు న్న ప్రయత్నం అదానీ అరెస్టుతో ఎన్డీఏకు ముగింపు తప్పదని ఆయన హెచ్చరించారు.
భవిష్యత్ భావి భారత ప్రధాని అయిన రాహుల్ గాంధీకి తనవంతు అండగా నిలిచేం దుకు, ప్రియాంక భారీ మెజార్టీతో గెలుపొందడం రాహులు, కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చినట్లు అయ్యిందన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన రెండు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం శుభపరిణామం అన్నారు.
రాహుల్ గాంధీ ఉత్తర భారత దేశానికి, ప్రియాంక గాంధీ దక్షిణ భారత ప్రాంతానికి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టితే, దేశంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలిపించడం తో పాటు, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బాటలు పడే అవకాశం ఉందని జీవన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకు ముందుకు సంబరాల్లో భాగంగా టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి,నందన్న, బండ శంకర్ , దుర్గయ్య,బీరం రాజేష్, అనిత, సరితరమేష్ రావు, పద్మసింగారావు, రేణుక మొగిలి, ఆసియా సుల్తానా కమల్ , జీవన్ , గుండ మధు, శ్రీనివాస్ , నెహల్, కొత్త మోహన్, చెరిష్మారెడ్డి, వినూత్నరెడ్డి, రూప, సౌజన్య, ముఖేష్ ఖన్నా, ప్రదీప్, శ్రీను,చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.