పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఆటో బయోగ్రఫీ గల్ఫ్ గాయం పుస్తకం అందజేసిన చాంద్ పాషా
డాక్టర్ చాంద్ పాషా కృషిని అభినందించిన మహేష్ కుమార్ గౌడ్
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు
ఆటో బయోగ్రఫీ గల్ఫ్ గాయం పుస్తకం అందజేసిన చాంద్ పాషా
డాక్టర్ చాంద్ పాషా కృషిని అభినందించిన మహేష్ కుమార్ గౌడ్
జగిత్యాల నవంబర్ 22:
సామాజిక కార్యకర్త, టీపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ చాంద్ పాషా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లో కలిసి తన ఆటోబయోగ్రఫీ గల్ఫ్ గాయం పుస్తకాన్ని అందజేశారు.
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే కార్మికులను నకిలీ ఏజెంట్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో తన పుస్తకంలో వివరించానని, గల్ఫ్ లో జైల్లో మగ్గి అక్కడే మృతి చెందిన వందలాది మంది కార్మికుల మృతదేహాలను స్వగ్రామాలను తరలించానని, తన స్వీయ అనుభవం తో గల్ఫ్ గాయం పుస్తకాన్ని రచించానని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ చాంద్ పాషాను మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు.
డాక్టర్ చాంద్ పాషా మాట్లాడుతూ
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐ బోర్డు ఏర్పాటు చేయాలని గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షలు మంజూరు చేయాలనే ఏళ్ల నాటి డిమాండ్‌ను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడంలో మహేష్ కుమార్ గౌడ్ కృషి చేశారన్నారు.
గల్ఫ్ బాధితుల తరఫున గతంలో పోరాటం చేసి గల్ఫ్‌ల మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు లక్ష పరిహారం అందేలా కృషి చేశానని గుర్తు చేశారు.
గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని తన డిమాండ్ ను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారని అన్నారు.
గ్రామాల్లో గల్ఫ్ వెళ్ళే కార్మికుల కుటుంబాలను నకిలీ ఏజెంట్ల బారిన పడవద్దని వందలాది అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యపరిచాను అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారంతోపాటు గల్ఫ్‌ల మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల పరిహారం అందజేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాలకు అందజేస్తున్న ఐదు లక్షల రూపాయలను ఉపాధి కోసం వలస వెళ్లిన అన్ని దేశాల్లోన్నీ కార్మిక కుటుంబాలకు అందజేయాలని కు ఆయన కోరారు.