రైతులు కన్నీళ్లు,, కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? - జిల్లా రైతు నాయకులు పొన్నాల తిరుపతి రెడ్డి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు. ఎర్పాటు చేసిన సమావేశంలో జిల్లా రైతు నాయకులు పొన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.....
గత ప్రభుత్వంలో రైతులు తెలిపిన శాంతియుత నిరసనలకు అక్రమ కేసులు పెట్టి తిప్పలు పెట్టిందని దొడ్డువడ్ల సాగువద్దు, మక్కలు కొనమని అన్నారని గుర్తు చేశారు, చక్కర ఫ్యాక్టరీ తెరువాలని జరిగిన నిరసనలతో ప్రభుత్వం రైతులపై కేసులు నమోదు చేసింది. ప్రజాపాలన, ప్రభుత్వం రైతులపై చిన్న చూపు చూస్తుంది.
గత ప్రభుత్వం లొ రైతులతో కలిసి నిరసనలో పాల్గొని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు ఈ రోజు రైతుల ద్వారా అధికారంలోకి వచ్చి , రైతులను కేసుల్లో విముక్తులను చేయాలని కోరుతున్నాం అన్నారు. గత ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలు భాగంగా అక్రమ కేసులు బనాయించి కోర్టు చుట్టూ తింపుతూ సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పుడున్న ప్రజా పాలన ప్రభుత్వంలో రైతు శ్రేయస్సు కోరే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు మంచి రోజులు వస్తాయని రైతులందరం ఆశించాం కానీ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రైతులపై దృష్టి సారించకుండా నిరక్షం చేయడం విడ్డూరం అని రైతు నాయకులు అన్నారు.
రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి రైతుల బాధలను తీర్చాలని కోరడం జరిగిందన్నారు.
జిల్లా రైతు నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి ,ఎం .రామ్ రెడ్డి కాటి పెళ్లి గంగారెడ్డి , ఐ లేని సాగర్ రావు, నేరెళ్ల భూమ రెడ్డి, బి మల్లయ్య, తీపి రెడ్డి రత్నాకర్ రెడ్డి, ఐలేని విక్రమ్ రెడ్డి, గోలి జనార్దన్ రెడ్డి, నోముల గోపాల్ రెడ్డి ,మందల గోపాల్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డిసురకంటి ముత్యం రెడ్డి. నీలగిరి గంగా రావు.జంగిడి మల్లేశం బోలుమల్ల సత్తయ్య డబ్బు వెంకట్ రెడ్డి . రొండీ శృతిక్.డబ్బు కాశీరం రెడ్డి