జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విట్టంపేట వద్ద సాగర్ కాల్వలో స్నానానికి వెళ్లిన డాక్టర్ ఉదయ్ గల్లంతు

On
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విట్టంపేట వద్ద సాగర్ కాల్వలో స్నానానికి వెళ్లిన డాక్టర్ ఉదయ్ గల్లంతు

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విట్టంపేట వద్ద సాగర్ కాల్వలో స్నానానికి వెళ్లిన డాక్టర్ ఉదయ్ గల్లంతు 

మెట్ పల్లి అక్టోబర్ 27:

మేట్ పల్లి మం. విట్టంపెట్ గ్రామ శివారులో ఎస్సారెస్పీ వరద కాలువలో సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు వైద్యులలో ఒకరు గల్లంతయ్యారు.

డిఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మెట్లచిట్టాపూర్ గ్రామనికి సరదాగా వచ్చిన వైద్యులు  తిరిగి విట్టంపెట్ గ్రామ శివారులో గల వరద కాలువ నుంచి తిరిగి వెళ్తుండగా ఎస్సారెస్పీ కాలువలో ప్రశాంత్,ఉదయ్ కుమార్ అనే వైద్యులు సరదాగా స్నానానికి వెళ్ళగా ఒక్కసారి వరద నీరు ఎక్కువ ఉండటంతో ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఊపిరి ఆడక నీటిలో గల్లంతు అవడంతో, వెంటనే ప్రశాంత్ అక్కడ ఉన్న  సమాచారం అందించారని తెలిపారు.

గల్లంతైన వైద్యులు ఉదయ్ స్వస్థలం హన్మకొండ కాగా మెట్ పల్లి పట్టణంలోని యశోద ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడని గల్లంతైన వ్యక్తి కోసం సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై చిరంజీవి సిబ్బంది తో గాలింపు చర్యలు చేపడుతున్నరని అన్నారు. ఫైర్ స్టేషన్ సిబ్బందికి కూడా సమాచారం అందించామని రాత్రి వరకు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.

Tags