మోదీ జీ, మీకు ఈ 5 కోట్లు టెంపోలో ఎవరు పంపారు?' వినోద్ తావ్డే పేరుతో రాహుల్ గాంధీ ప్రశ్న
'మోదీ జీ, మీకు ఈ 5 కోట్లు టెంపోలో ఎవరు పంపారు?' వినోద్ తావ్డే పేరుతో రాహుల్ ప్రశ్న
ముంబయి నవంబర్ 19:
'మోదీ జీ, మీకు ఈ 5 కోట్లు టెంపోలో ఎవరు పంపారు?' వినోద్ తావ్డే పేరుతో రాహుల్ గాంధీ ప్రశ్నించారు
మహారాష్ట్ర ఎన్నికలకు ఒక రోజు ముందు, 'ఓట్ల కోసం నగదు' ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. నాలాసోపరాలోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు విరార్‌లోని ఓ హోటల్‌లో నగదు పంపిణీ చేస్తుండగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కాబోయే ముఖ్యమంత్రి పోటీదారు వినోద్ తావ్డే పట్టుబడ్డారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) ఆరోపించారు. వినోద్ తావ్డే ఒక దశలో జాతీయాధ్యక్షుడు అవుతాడని కూడా ప్రచారం జరిగింది. బీజేపీ లోని కొందరు కావాలనే తావ్దే ను ఇందులో ఇరికించారని అనుమానాలు కూడా ఉన్నాయి.
వినోద్ తావ్డే బ్యాగ్‌లో నగదుతో పాటు లాల్ డైరీ దొరికినట్లు BVA పేర్కొంది. అందులో ఆ వ్యక్తుల వివరాలు ఉన్నాయని ప్రకటించింది.
బహుజన వికాస్ అఘాడి (బి వి ఏ) ఒక ప్రాంతీయ పార్టీ. పాల్గర్ ప్రాంతంలో ఈ పార్టీ రెండు మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచి, అధికారపార్టీ పంచన ఉంటుంది. ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను ఓడించడానికి బీజేపీ డబ్బులు పంచుతుందని పార్టీ అధ్యక్షుడు ఆరోపించారు. పార్టీ అధ్యక్షునికి దాదాపు 42 సార్లు వినోద్ తావ్డే పొన్ చేసి, యీ పరిస్థితుల్లో నుండి బయట చేయాలని కోరినట్లు ప్రకటించాడు.
.