ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం డేంజర్
గాంధీలో యాంటీ బయోటిక్స్ మందుల వాడకంపై అవెర్నెస్
ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం డేంజర్
* గాంధీలో యాంటీ బయోటిక్స్ మందుల వాడకంపై అవెర్నెస్
సికింద్రాబాద్ నవంబర్ 19 (ప్రజామంటలు):
ఏదేని అనారోగ్యం కలిగినప్పుడు స్వంత నిర్ణయాలతో యాంటి బయోటిక్స్ వాడటం ప్రమాదకరమని, తప్పని సరిగా డాక్టర్ ను సంప్రదించి, మందులను సరైన మోతాదులో వాడాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.ఇందిరా పేర్కొన్నారు. మంగళవారం గాంధీ మెడికల్ కాలేజీ మైక్రో బయోలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వరల్డ్ ఏఎంఆర్ అవెర్నెస్ వీక్ సందర్బంగా యాంటిబయోటిక్స్ మందుల వాడకంపై డాక్టర్లు గాంధీ ఆవరణలో అవెర్నెస్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడకం వలన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సమస్యలు ఏర్పడి, భవిష్యత్ లో మెడిసన్స్ బాడీలో పనిచేయకుండా అవుతుందన్నారు. యాంటీ బయోటిక్స్ మందులు అతిగా వినియోగిస్తే ఆరోగ్యానికి నష్టమని, రెసిస్టెన్స్ పవర్ తగ్గి మరిన్ని రోగాలు కలుగుతాయన్నారు. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సాధారణ జబ్బులకు మెడికల్ షాపుల్లో కొన్న యాంటి బయోటిక్స్ ఓ పద్దతి లేకుండా మోతాదుకు మించి, లేదా, తక్కువగా వాడటం వలన రోగ నిరోదక శక్తి క్రమంగా తగ్గి, వైరస్ లేదా బాక్టీరియాలు సదరు మెడిసన్స్ కు అలవాటు పడి ఆయా మందులు పనిచేయకుండా పోతాయన్నారు. యూజ్ రైట్ డ్రగ్, రైట్ డోస్, రైట్ టైమ్ అనే స్లోగన్ తో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి, మైక్రోబయాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డా.రవిశేఖర్ రావు, ఆర్ఎంవో వన్ శేషాద్రి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ పూజ, ఎంపీహెచ్ఓ వేణుగోపాల్ గౌడ్, డాక్టర్లు, మెడికోలు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
––––––