వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కోరుట్ల నవంబర్ 18 ( ప్రజా మంటలు ) :
కోరుట్ల పిఏసిఎస్ (ప్యాక్స్) వరి ధాన్య కొనుగోలు కేంద్రం తో పాటు చిన్న మెట్పల్లి ఫ్యాక్స్ సెంటర్ మరియు మేడిపల్లి మండలం లోని పిఏసిఎస్ (ప్యాక్స్) వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు.
ఈ సందర్బంగా ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని, సీరియల్ క్రమంలో తూకం వేస్తున్నార లేదా అని పరిశీలించారు.
అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేయాలని తర్వాత తూకం వేసిన దాన్యం బస్తాలను అలర్ట్ అయిన రైస్ మిల్లులకు వెంట వెంటనే పంపించాలని సూచించారు. సెంటర్ ఇన్ చార్జీలను పిలిచి ట్యాబ్ డాటా ఏపటికపుడు అప్ డేట్ చేయాలని మరియు రిజిస్టరులలో వారి ధాన్యం కుప్పలను సీరియల్ క్రమంలో ఎంట్రీ చేయాలని తెలిపారు.
తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డిఓ జివాకర్, ఎమ్మార్వో మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.