ఇందిరా మహిళా శక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 20 నవంబర్ (ప్రజా మంటలు) :
వరంగల్ సభ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవ సభ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈపతకం ప్రవేశపెట్టారని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
ఇందిరా గాంధీ ఆశయాల మేరకు మహిళలను స్వయం సాధికారత కలిగిన శక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని తెలిపారు.
Tags