ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే సర్కార్ తో యుద్ధమే ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ
ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే సర్కార్ తో యుద్ధమే
ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ
జనగామ అక్టోబర్ 26 (ప్రజామంటలు) :
ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే రేవంత్ సర్కార్ తో యుద్ధమేనని, దేశంలో మేమే మొదట వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేయడం, నమ్మిన జాతికి నమ్మక ద్రోహం తలపెట్టడమేనని ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ అన్నారు. ఎస్సి వర్గీకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణను తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కేంద్రంగా జరిగే మాదిగల ధర్మ యుద్ధ మహాసభకు లింగాల గణపురం మండల నుంచి అధిక సంఖ్యలో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా రాగల్ల ఉపేందర్ మాదిగ, ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి సందెన రవీందర్ మాదిగలు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పి, ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కుట్రలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ, మాదిగ ఉపకులాలను నమ్మించి నయవంచనకు గురి చేసిన నమ్మకద్రోహి అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటల్లో ఒకటి, చేతల్లో మరొకటి చేస్తూ మోసం చేస్తున్నాడని రేవంత్ రెడ్డిని నమ్మితే ఎంత ద్రోహం చేస్తాడో టీచర్ల ఉద్యోగ నియామక ప్రక్రియతో అర్థమయిందని ఇప్పుడు మరలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్, వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కుట్ర చేస్తు మాదిగలని ప్రమాదంలోకి నడుతున్నాడని మండిపడ్డారు.హర్యానా తమిళనాడు పంజాబ్ లాంటి రాష్ట్రాలు వర్గీకరణ చేస్తుంటే దేశంలో నేనే మొదలు అమలు చేస్తానన్న మీ కంటికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ విభాగాల నాయకులు నల్ల ఉపేందర్ మాదిగ గడ్డం సోమరాజు స్పందన సోమరాజ్ అనిల్ ప్రశాంత్ శివ శేఖర్ యాదయ్య మాదిగ, నరేష్, నల్ల మైసయ్య అంజయ్య రాజు సందీప్ పాల్గొన్నారు.
ుుు-