జిల్లా స్థాయి భగవద్గీత పఠన పోటీలు
జిల్లా స్థాయి భగవద్గీత పఠన పోటీలు
కోరుట్ల నవంబర్ 20:
గీత జయంతి ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్, జగిత్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించే భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు ఈ సంవత్సరం శ్రీమద్ భగవద్గీత "ఆత్మ సమయమ యోగము", ఆరవ అధ్యాయం పై నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా 18 అధ్యాయాలు పూర్తిగా వచ్చిన వారికి కూడా పోటీలు నిర్వహించబడును 6 ,7 తరగతి మొదటి గ్రూపు గాను, ఎనిమిది తొమ్మిది తరగతిరెండవ గ్రూపు గాను విభజించి “ఆరవ అధ్యాయము ఆత్మ సమయమ యోగం” పై పోటీలు నవంబర్ 29 తారీకు 2024 రోజున జడ్పీ బాలికల హైస్కూలు, MLA క్యాంపు కార్యాలయం దగ్గర,కల్లూరు రోడ్ కోరుట్ల జగిత్యాల జిల్లా నందు నిర్వహించబడును.
అదేవిధంగా 18 అధ్యాయాలు 700 శ్లోకాలు వచ్చిన, ఆరు సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు వారికి మూడవ గ్రూపుగా 18 సంవత్సరాలుపై ఉన్నవారి నాలుగు గ్రూపుగా విభజించి పోటీలు నిర్వహించబడును. అందరికి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లు ఇవ్వబడును కావున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు శ్రీమద్ భగవద్గీత నేర్పించి పోటీలలో పాల్గొనలని, టిటిడి కార్యక్రమ నిర్వహకులు కరీంనగర్ మరియు వరంగల్, మంచాల జగన్, జిల్లా కన్వీనర్ ఆర్ కృష్ణమూర్తి కోరారు.ఇతర వివరాలకు సెల్ నంబర్ 9885176157 మరియు 9441790725మరియుజగిత్యాల TTD ధర్మచార్యులు ఆకుబత్తిని (గౌరీ)శ్రీనివాస్,జగిత్యాల ఇంచార్జ్ లను సంప్రదించవచ్చు.