బీసీల సమరభేరి సభను విజయవంతం చేయండి. - రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్.

బీసీల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ.

On
బీసీల సమరభేరి సభను విజయవంతం చేయండి. - రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) : 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కౌండిన్య హాల్లో బుధవారం రోజున జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకట్ ముదిరాజ్ ఈనెల 25న హైదరాబాదులోని రవీంద్ర భారతిలోజరిగేబీసీలసమరభేరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.... రాష్ట్ర నలుమూలల నుండి బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు,అన్ని కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బీసీల సమస్యల గురించి ఏర్పాటుచేసిన సమరభేరి కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయగలని, కోరారుదేశంలో70 శాతం కలిగిన బీసీలకు కేవలం 2000 కోట్ల బడ్జెట్ కేటాయించడం బీసీలను అలగదొక్కే కార్యక్రమంలో ఒక భాగం అన్నారు.

70 కోట్ల జనాభాకు కేంద్రంలోఒక వెనుకబడిన తరగతుల మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాల న్నారు,చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాదులో జరిగే ఈ సమరభేరి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలోని అన్ని కుల సంఘాల ప్రజలు హాజరుకావాలని రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలోబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు,టి.నందగోపాల్ చిగుర్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శిఅవారిలత,కార్యదర్శిముసిపట్లలక్ష్మీనారాయణ,యువజన సంఘం జిల్లా అధ్యక్షులుకొక్కుగంగాధర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, విద్యార్థి సంఘంజిల్లా అధ్యక్షులు దండుగులవంశీ, జిల్లామహిళా సంక్షేమ సంఘం సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా, సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, పట్టణాధ్యక్షుడురాపర్తిరవి,కోటగిరి రాజేష్,చిలుకరాజలింగం,యూత్ కో-ఆర్డినేటర్ హృషి కేష్,బిసినాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags