డాక్టర్ వి.వి. రంగనాథన్‌కు ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఘన సన్మానం
డాక్టర్ వి.వి. రంగనాథన్‌కు ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఘన సన్మానం
(అంకం భూమయ్య)
కోరుట్ల నవంబర్ 19:
యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సేవా దృక్పథం, మానవతా భావంతో ప్రజలకు అండగా నిలిచిన డాక్టర్ వి.వి. రంగనాథన్ ఎండి. జనరల్ ఫిజీషియన్ కు ఘన సన్మానం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఆదిత్య హాస్పిటల్ లో ప్రజల ఆరోగ్య రక్షణకు అంకితమై పని చేస్తూ, అనేక మంది ప్రజలకు ఆశాజనక సేవలను అందిస్తున్నారు. ప్రత్యేకంగా కరోనా మహమ్మారి సమయంలో మరియు వైరల్ జ్వరాలు విజృంభించిన సమయంలోనూ డాక్టర్ రంగనాథన్ తన అనుభవంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ, "డాక్టర్ రంగనాథన్ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రాణాలను కాపాడారు. కోరుట్ల ప్రజలకు ఆయన దొరకడం నిజంగా అదృష్టం," అని ప్రశంసించారు.
అదేవిధంగా జగిత్యాల్ డిస్టిక్ కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్. కోరుట్ల పట్టణం 32వ వార్డు ఇంచార్జ్ వసీం యూర్ రాహ్మాన్ (వసీం) మాట్లాడుతూ.
డాక్టర్ రంగనాథన్. ప్రజల కష్టకాలంలో ఎప్పుడూ ముందు ఉండి, సకాలంలో చికిత్సలు అందించడం ద్వారా వారిలో నమ్మకాన్ని కలిగించారు. వైరల్ జ్వరాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్షణం చికిత్స అందించి, ఆపదలో ఉన్న వారికి ధైర్యం కలిగించడం ద్వారా ఆయన ప్రజల జీవితాలలో అద్భుత మార్పు తీసుకొచ్చారు. ఈ ఆపత్కాలంలో చూపించిన పట్టుదల, సహనం, మరియు సేవా దృక్పథం కారణంగా ఆయన కోరుట్ల ప్రజల హృదయాల్లో మరుపురాని గుర్తుగా నిలిచారు.
కోరుట్ల ప్రజలు ఆయనను దేవదూతగా భావిస్తూ, ఆయన సేవలను తమ జీవితానికి వరంగా భావిస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్. యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ జగిత్యాల్ డిస్టిక్ జర్నల్ సెక్రెటరీ మహమ్మద్ మసీయుద్దీన్. కోరుట్ల పట్టణ కోశాధికారి అదనాన్ షకీల్. కోరుట్ల పట్టణ జనరల్ సెక్రెటరీ ఎం ఏ జమీల్. కోరుట్ల పట్టణ ఉపాధ్యక్షులు ఎండి బషీరుద్దీన్. స్థానిక ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొని డాక్టర్ రంగనాథన్. గౌరవాన్ని తెలియజేస్తూ, ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.