తిట్ల పూరాణాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి - దావ వసంత సురేష్.

ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం సరికాదు.

On
తిట్ల పూరాణాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి - దావ వసంత సురేష్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) : 

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ముందు మహిళలకు ఇస్తానన్న 2,500 మరియు తులం బంగారం ఇవ్వాలి. వరంగల్ వేదికగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,ఎమ్మెల్సీ ఎల్.రమణ ,మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్,వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చల్మెడ లక్ష్మి నరసింహ రావు ,మాజీ జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి గార్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ 

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతు....

తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడైన కెసిఆర్ పై ఇష్టారీతిన కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా,మాట లేకుండా కనపడకుండా చేస్తా అంటూ దుర్మార్గమైన మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని ఇచ్చిన ఎ ఒక్క హామీలను సక్రమంగా అమలు చేయక నోటికి వచ్చిన మాటలు,నోటికి వచ్చిన వాగ్దానాలను చేస్తున్నారని తెలిపారు.

మీ దుర్మార్గమైన పాలనను ప్రజలంతా గమనిస్తున్నారు,తొందర్లోనే నీ ఆనవాలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని గుర్తు చేశారు.

ఎల్.రమణ మాట్లాడుతూ.....

జాతీయ ఉద్యమాలు నిర్వహించి సాధించిన తెలంగాణలో పునర్ నిర్మాణ కార్యక్రమాల పేరు మిద కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్,మిషన్ భగీరథ లాంటి తాగునీటి సౌకర్యాన్ని పరిపాలన సంస్కరణలను హైదరబాద్ నగరంలో సచివాలయం,అమరజ్యోతి అనేకమైన కార్యక్రమాలతో భారతదేశంలో ఉన్నటువంటి అందరి దృష్టి ఆకర్షించే విధంగా పరిపాలన చేసి చూపెట్టారు కెసిఆర్ రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలు ఒక్క సారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మీ నాయకత్వ పరిపాలన లేకపోవడం వల్ల,ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసి శక్తి మీకు లేకనే కెసిఆర్ ని దూశిస్తున్నారు ఇప్పటికైనా దూషణలు మాని ప్రజల ప్రేమ పొందండి,మంచి సుపరిపాలన చేయండి,సంపద సృష్టించండి,ఇచ్చిన హామీలను నిలబెట్టుకొండి మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అన్యాయంగా కెసిఆర్ ని వారి నాయకత్వంలో పని చేస్తున్న నాయకులను తిట్టినట్టైతే మీకు పుట్టగతులు ఉండవు.

దావ వసంతసురేష్ మాట్లాడుతూ....

సిఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చెప్పటిన నాటి నుండి కేసీఆర్ పేరెత్తకుండ ఉండట్లేదు.సిఎం గా బాధ్యతలు చేపట్టకముందు,తరువాత రేవంత్ రెడ్డి కి కెసిఆర్ అంటే భయంమన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ ని ప్రజల గుండెల నుంచి తొలగించడం మీ వల్ల కాదు కదా మీ జేజమ్మ వల్ల కూడా కాదు అన్నారు.

కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు కుర్చీలో కూర్చున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. 

కెసిఆర్ ఒక మహా వృక్షం లాంటివారని కెసిఆర్ తెలంగాణలో ఆకాశమంత వ్యాపించి ప్రజలకు మంచి పరిపాలన,ప్రతి ఇంట్లో అన్ని ఫలాలు అందించి మహావృక్షంగా ఎదిగినటువంటి కెసిఆర్ చిన్న వేర్లను కూడా పెకిలించే శక్తి మీకు,మీ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

రేవంత్ రెడ్డి ఒక కలుపు మొక్కగా రాష్ట్రానికి వచ్చారని ప్రజలంతా అనుకుంటున్నార తెలిపారు.

ఆ కలుపు మొక్కని రాష్ట్ర ప్రజలు తొందర్లోనే ఏరిపారేస్తారన్నారు.

ఎ ఒక్క హామీలను సక్రమంగా అమలు చేయకుండా,ప్రజలంతా అరిగోసా పడుతుంటే.ఏం ఉద్దరించారని విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం.

దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న క్షేత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాగా చేసింది కెసిఆర్ అని గుర్తు చేశారు.

తిట్ల పూరణానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అన్నారు.

ఆరు గ్యారంటీల హామీతో కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి కెసిఆర్ కుటుంబం పై దృష్టి పెట్టి ప్రజాపాలనను పడకేసే విధంగా ప్రజల దృష్టిని మరలించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారన్నారు.

మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయల పై కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎ ఊరికి వచ్చిన ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

సుంకె రవిశంకర్ మాట్లాడుతూ....

జాతీయ స్థాయిలో కేసీఆర్ అన్ని పార్టీల మద్దతు కూడా గట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ని సీఎం రేవంత్ వరంగల్ లో అసభ్య పదజాలం తో మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం..పరిపాలన అనుభవం లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, తిట్టడం బందు చేసి పరిపాలన పై ద్రుష్టి పెట్టండి,రేవంత్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు కేసీఆర్ పట్ల మీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు రాంమోహన్ రావు,కోల్ముల రమణ,బిఆర్ఎస్ పార్టీ సారంగాపూర్ మండల సమన్వయ కమిటీ నాయకులు సత్యంరావు మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags