సీడ్స్, పెస్టిసైడ్స్.. కల్తీ దారులపై ఉక్కుపాదం మోపాలి

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి 

On
సీడ్స్, పెస్టిసైడ్స్.. కల్తీ దారులపై ఉక్కుపాదం మోపాలి

సీడ్స్, పెస్టిసైడ్స్.. కల్తీ దారులపై

ఉక్కుపాదం మోపాలి

## రైతులకు ముఖ్యమైనవి నేల, నాణ్యమైన విత్తనాలు, సాగు నీరు, పెస్టీసైడ్స్, మార్కెటింగ్ 

## రైతులకు వ్యవసాయ అధికారులు అండగా నిలువాలి

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి 

నూతనంగా రిక్రూట్ అయిన 143 మంది వ్యవసాయ అధికారుల శిక్షణ ముగింపు సమావేశం

హైదరాబాద్ నవంబర్ 19:

విత్తనాలు, క్రిమిసంహారక మందులు కల్తీ చేసే కంపెనీలు, వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, పీ.డీ. యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు.

శనివారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ( ఎం సీ ఆర్ హెచ్ ఆర్ డీ) లో జరిగిన నూతనంగా రిక్రూట్ అయిన వ్యవసాయ అధికారుల శిక్షణ ముగింపు సమావేశంలో చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతులకు ముఖ్యమైనవి సారవంతమైన నేల, నాణ్యమైన విత్తనాలు, సాగు నీరు, నాణ్యమైన క్రిమి సంహారక మందులు, మార్కెటింగ్ అని, వ్యవసాయ అధికారులు ( ఏ. ఓ ) రైతులకు అండగా నిలవాలని సూచించారు.

నేల సారం పెరిగేలా ఏ.ఓ. లు చర్యలు తీసుకోవాలని, అందుకు వర్మి కంపోస్టులో రైతులకు ప్రోత్సహించాలని చిన్నారెడ్డి తెలిపారు. వ్యవసాయం లేకుండా సంస్కృతి లేదని, వ్యవసాయం చేసే రైతులకు సేవా చేయడం అంటే భగవంతునికి చేసినట్లేనని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో కూరగాయల కొరత ఉందని, కూరగాయలు, పండ్ల ఉత్పత్తుల కోసం కూడా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని చిన్నారెడ్డి తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ లో పాల సరఫరా డిమాండ్ కు అనుగుణంగా లేవని, ప్రతి రోజూ ఒక లక్ష లీటర్ల పాల సరఫరా కొరత ఉందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

పాడి, పంటలపై వ్యవసాయ అధికారులు దృష్టిని పెట్టాలని చిన్నారెడ్డి ఏ.ఓ. లకు సూచించారు. వర్షాభావ ప్రాంతాల్లో వాటర్ షెడ్ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని కూడా ఆయన సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వ్యవసాయ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని చిన్నారెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండ రెడ్డి, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ విభాగము హెడ్ కెప్టెన్ పాండురంగా రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బీ. గోపి, శిక్షణ కోర్సు ఇన్చార్జి ఉషారాణి,  వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర చైర్మన్ బొమ్మిరెడ్డి కృపాకర్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ఉన్నతాధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags