కాంగ్రెస్ నాయకులు,మాజీ సర్పంచ్ బాస భూమయ్య మృతి
కాంగ్రెస్ నాయకులు,మాజీ సర్పంచ్ బాస భూమయ్య మృతి
కోరుట్ల నవంబర్ 19:
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బాస భూమయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ప్రగాఢ సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించి, దైర్యం చెప్పి ఓదార్చారు.
బాస భూమయ్య పార్థివదేహం మీద కాంగ్రెస్ జెండాను ఉంచి నివాళులు అర్పించారు.
జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ బాస భూమయ్యకు తన తండ్రి మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు,
బాస భూమయ్య 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని, నీటి సంఘం చైర్మన్ గా, గ్రామ సర్పంచిగా చేసిన సేవలు కృషి మరువ లేనివి అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నాయకులు మిచ్చమ్మ చారిటీస్ నిర్వాహకులు డా.జే. ఎన్ వెంకట్ ఫోన్ ద్వారా భూమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాస భూమయ్య అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య పూర్తి అయ్యాయి..
అంత్య క్రియల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యం రావు, కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కౌన్సిలర్ ఎంబేరి నాగ భూషణం, ఆలయ కమిటీ చైర్మన్ కటుకం రాజేశ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నబి, మాజీ ఎంపిటిసి బర్కము నర్సయ్య, మాజీ సర్పంచ్ ఖాజాబి, మాజీ ఉపసర్పంచ్ విట్టల రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టి బాబు, ధ్యాగ గంగాధర్, పిట్టల రమేష్, బర్కము రాజేందర్, కోత్తపల్లి వెంకటేష్, పడాల లచ్చన్న, మహమ్మద్ నసీర్, సయ్యద్,రసత్ పాషా,అనుమల్ల రాజేశం,బండ్ల రమేష్, పుప్పాల నారాయణ పలువురు ప్రజాప్రతినిధులు,
బంధుమిత్రులు,కాంగ్రెస్ శ్రేణులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.