టిఆర్ఎస్ బీఫామ్ తో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి. - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత.

On
టిఆర్ఎస్ బీఫామ్ తో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి. -  మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు)

టిఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.

బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఇటీవల జిల్లాలో జరిగిన సంఘటనలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాట్లాడిన జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ మాట్లాడుతూ....

బిఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీని విడిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రోజే కాంగ్రెస్ వ్యక్తి అయినాడని గుర్తు చేశారు.

బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మళ్లీ నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాను అనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోక పోతే గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెట్టిన సమావేశానికి ఎందుకు హాజరైనారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాడు అని జగిత్యాల లోని చిన్న పిల్లవాడు నుంచి పెద్ద వారి దాకా అందరికీ తెలిసిందే.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒక వైద్యుడు,వైద్యుని దగ్గరికి ఒక పేషెంట్ వస్తే ఎలా ప్రవర్తిస్తాడో తెలిసిన వ్యక్తి మరి ఇలా ఎందుకు మాట్లాడాడు అతని మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.

గతంలో ఎమ్మెల్యే కి రాజకీయ జన్మనిచ్చింది బిఆర్ఎస్ పార్టీ మరియు కవితక్క అని చెప్పి నిన్న మాత్రం కాంగ్రెస్ పార్టీ నేపథ్యం కలిగిన కుటుంబం అని సోయి లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. తమ కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అంటున్న ఎమ్మెల్యే గతంలో ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ జగిత్యాలలో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే రాహుల్ గాంధీ ని పప్పు అని స్క్రిప్ట్ చదివినాడు .అని మరి ఎందుకు విమర్శలు చేసినాడు.

పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే పదవి పోతుందని భయంతో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతున్నారు.

ఎమ్మెల్యే కి జన్మనిచ్చింది ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చింది బి ఆర్ ఎస్ పార్టీ మరియు కవితక్క అయిన ఇంత నీచమైన దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అని మేము బిఆర్ఎస్ పార్టీ తరపున అడుగుతున్నామని సూటిగా ప్రశ్నించారు.

రూరల్ మండలము జాబితాపూర్ గ్రామంలో జరిగిన మారు గంగారెడ్డి అత్యాచారాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూన్నామన్నారు.

బిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడని అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాటలను బిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం.

హత్యకు,బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు.

పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో జగిత్యాల నియోజకవర్గంలో ప్రశాంతమైన,పచ్చనైన సంక్షేమం అభివృద్ధి ప్రజల యొక్క శాంతి భద్రతలే ధ్యేయంగా ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు.

కానీ ఈనాడు శాంతి భద్రతలకు నిరంతం వాటిల్లిందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఇలా మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఏంటని బిఆర్ఎస్ పక్షాన అడుగుతాఉన్నామన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం ఎందుకు వాటిల్లుతుందని ప్రజలతో పాటు తాము కూడా భయాందోళనకు గురై పరిస్థితి ఉందని అన్నారు.

ఉద్యమనాయకుడు కెసిఆర్ నాయకత్వంలో ఒక్క రక్తపు బొట్టు కూడా నెలకు రాలకుండా రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కెసిఆర్ అని గుర్తు చేశారు.

ఇప్పుడు జరుగుతున్న నెర చరిత్రకు,రక్తపు మరకలకు,హత్యలకు బిఆర్ఎస్ పార్టీకి కానీ కెసిఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న ఏ ఒక్కరికీ కూడా సంబంధం లేదన్నారు.

బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కెసిఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతూ,కొట్లడుతూ ప్రజలకు సుబిక్షమైన సంక్షేమ పలాలు అందిస్తామే తప్ప ఇటువంటి హత్య రాజకీయాలకు దూరంగా ఉంటామని తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షుడు గట్టు సతీష్,ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,కౌన్సిలర్ దేవేందర్ నాయక్,మాజీ ఏ ఎం సి చైర్ పర్సన్ శీలం ప్రియాంక ప్రవీణ్,అర్బన్ మండల అద్యక్షుడు తుమ్మ గంగాధర్,మాజీ జెడ్పీటీసీ మహేష్,అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు,రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు పడిగేల గంగారెడ్డి,ఆనంద్ రావు, ఆసీఫ్,శ్రీనివాస్,గంగారాజం,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ముత్తు,నాయకులు నక్క గంగాధర్,కొల్లూరి వేణు,చింతల గంగాధర్,ప్రణయ్,బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags