రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ
భూకేటాయింపు అక్రమాలపై అమోయ్ కుమార్ను ప్రశ్నించిన ఈడీ ఏడున్నర గంటల పాటు వివిధ అంశాలపై ఈడీ ప్రశ్నలు
రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ
భూకేటాయింపు అక్రమాలపై అమోయ్ కుమార్ను ప్రశ్నించిన ఈడీ
ఏడున్నర గంటల పాటు వివిధ అంశాలపై ఈడీ ప్రశ్నలు
హైదరాబాద్ అక్టోబర్ 23 (ప్రజా మంటలు) :
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ను ఈడీ ఏడున్నర గంటల పాటు విచారించింది. రంగారెడ్డి జిల్లాలో భూకేటాయింపులపై అక్రమాలు జరిగాయన్న కేసులో అమోయ్ కుమార్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఉదయం 8 గంటలకు మీడియా కంటపడకుండా బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.
ఈడీ అధికారులు ఆయనను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విచారించారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే 42 ఎకరాల భూమిని అక్రమంగా ఎలా బదిలి చేశారని ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు కలెక్టర్గా పని చేశారు.
అధికార దుర్వినియోగం, ఆర్థిక దుర్వినియోగం ఆరోపణలతో ఆయన హయాంలో జరిగిన భూ ఒప్పందాలు, కేటాయింపులపై దర్యాప్తు దృష్టి సారించింది. చట్టపరమైన విధానాల ఉల్లంఘనలు మరియు భూ కేటాయింపులకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు ఏమైనా ఉన్నాయా అని నిర్ధారించడానికి ఈడీ ఈ ఫిర్యాదులను పరిశీలిస్తోంది. ఆమోయ్ కుమార్ ను ఈడీ పిలవడం అనేది ఇతర అధికారులు మరియు వాటాదారులను మరింత ప్రశ్నించే అవకాశం ఉన్న పెద్ద విచారణలో ఒక భాగం మాత్రమేనాని అనుకొంటున్నారు. ఇంకా చాలామంది అధికారులను, రాజకీయ నాయకులను కూడా విచారించే అవక్షం ఉందని తెలుస్తుంది.
----------------------