ఘనంగా ప్రవాసి భారతీయ దినోత్సవం వేడుకలో పాల్గొన్న జగిత్యాల జిల్లా వాసులు
ఘనంగా ప్రవాసి భారతీయ దినోత్సవం వేడుకలో పాల్గొన్న జగిత్యాల జిల్లా వాసులు
భువనేశ్వర్ జనవరి 10:
ప్రవాసీ భారతీయ దినోత్సవ వేడుకలు ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించగా, శుక్రవారం ముగింపు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పాల్గొన్నారు.
బిజెపి ఏపీ ఇంచార్జ్ డొక్కా శ్రీనివాస్, బిజెపి యూఏఈ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి తో పాటు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబారావుపేట కు చెందిన వోర్రె గంగారాం ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ వేడుకల్లో విదేశాల్లో ఉన్న ప్రవాసీ భారతీయులు, జగిత్యాల జిల్లాకు చెందిన మేడిపల్లి మండలం తొంభరావుపేట గ్రామానికి చెందిన వోర్రె గంగారం, పలువురు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ నుండి 250 మంది ప్రవాసీ భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురికి అవకాశం దక్కింది.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన భారత ప్రభుత్వానికి, ఇండియన్ కౌన్సిలేట్ ఆఫ్ ఇండియా అధికారులకు దుబాయ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.