మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 09:
విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ది తో కృషి చేయ గలమని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల లో గురువారం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన వంట పాత్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..ప్రభుత్వం ద్వారా వచ్చిన వంట పాత్రల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపు కుంటున్నామని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే కార్మికుల వేతనాల పెంపు, విద్యార్థులకు పెట్టే గుడ్డు ధరలు పెంచడం వంటి తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, కచ్చితంగా ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అదే విధంగా వంటకు సిలిండర్లు లేక కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పడం జరిగిందని ఎక్కడైతే సిలిండర్ల అవసరం ఉందో మండల విద్యాధికారి కి నివేదిక ఇవ్వాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అట్టి సమస్యను పరిష్కరిస్తామని, విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత పాటించే విధంగా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థకు పెద్ద పీట వేయడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, ఎం ఈ ఓ సీతాలక్ష్మి,
స్కూల్ హెచ్ ఎం, ఉపాద్యాయులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.