HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు
HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు
హైదరాబాద్ జనవరి 06:
చైనాలో HMPV వ్యాప్తి , భారతదేశంలో తొలి కేసు నమోదు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.ఇప్పటివరకు దేశంలో మూడు కేసులు నమోదయ్యాయి.
అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా పరిస్థితిని పరిశీలిస్తుందని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకొంటామని ఆరోగ్య మంత్రి దామోదరం నరసింహ హెచ్చరించారు.
ఇది కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు నిర్ధారించారు. ఇది మొదట 2001లో కనుగొనబడింది. ఇది చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉంది.
ఈ వైరస్ గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది. వసంత ఋతువు ప్రారంభంలో కూడా వ్యాపిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.