నేరెళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలి
నేరెళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ విప్ ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి
ధర్మపురి జనవరి 06:
నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు లో భాగంగా నేరెళ్ళ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు కోసం కృషి చెయ్యాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి న్యాయవాది జాజాల రమేష్ నేతృత్వంలో నేరెళ్ల, గోవిందుపల్లె నాయకులు వినతిపత్రం అందజేశారు.
1968నుండి 2004వరకు నేరేళ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకారం ఉండేదని, ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సిబ్బంది కొరత వలన విలీనం చేశారని దీనిని దృష్టిలో ఉంచుకుని తిరిగి నేరెళ్ల లో సహకార సంఘం ఏర్పాటు చేస్తే చుట్టు పక్క గ్రామాల రైతులకు సౌకర్యార్థం గా ఉంటుందని వివరించారు
ధర్మపురి సహకార సంఘం వైస్ చైర్మన్ శేర్ల రాజేశం, డైరెక్టర్ జాజాల లక్ష్మీ వెంకన్న, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డవేని సత్యం, కాంగ్రెస్ పార్టీ నేరెళ్ళ అధ్యక్షుడు కసారాపు బలగౌడ్ గోవిందుపల్లే అధ్యక్షుడు పురంశెట్టి మల్లేశం, శ్రీ సాంబశివ దేవస్థానం చైర్మన్ కాసరాపు రాజాగౌడ్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మెన్ జంగిలి తిరుపతి, అరబిందో పాఠశాల అధినేత జాజాల రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తొట్ల రాజన్న, నాయకులు పురంశెట్టి సుధాకర్, మడిశెట్టి లక్ష్మణ్, వేముల సురేష్ రైతులు పాల్గొన్నారు.