మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బ్రెయిలీ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 4 (ప్రజా మంటలు) :
జిల్లా మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ పరిశోధన మరియు శిక్షణ కేంద్రం టీచర్స్ భవన్ లో లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదిన వేడుకలలో పాల్గొని దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి,2025 బ్రెయిలీ క్యాలండర్ ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
- లూయిస్ బ్రెయిలీ లిపి అందుల పాలిట గొప్ప వరం.
- జగిత్యాల పట్టణ దివ్యంగులకు డబల్ బెడ్ రూం ఇండ్ల ను కేటాయించి గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
- ప్రజా ప్రతినిదులు ఒక లక్ష్యం తో పని చేయాలని భావిస్తా.
- నివారించగలిగె అంధత్వం భారతదేశం లో అత్యధికం...
- అందత్వ నివారణ లక్ష్యం గా ఉచిత కంటి శస్త్ర చికిత్స లు చేయటం ఒక సామాజిక బాధ్యత గా భావిస్తా అన్నారు.
- అంధులు సమాజం లో అందరితో సమానంగా జీవించే హక్కు ఉందనీ,అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
జగిత్యాల లో సఖి కేంద్రం,బాల సదన్,వృద్ధాశ్రమం భవనాలు మరియు ఇందిరా శక్తి భవనల నిర్మాణం లో భాగంగా 5 కోట్ల తో భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది.
ప్రజలు అవసరమైన ప్రతి అభివృద్ధి పనికి నిరంతరం తన వంతుగా కృషి చేస్తా.
అందులకు జగిత్యాల లో స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తా అన్నారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ డి ఓ డాక్టర్ నరేష్,EE AH ఖాన్,DE వాజిద్, సీడీపీవో మమత,తదితరులు పాల్గొన్నారు.