పొలంలో వరి నారుతో సీ ఎం పేరు ప్రధర్శన. - కాంగ్రెస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి శోభారాణి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
పెగడపల్లి జనవరి 4 (ప్రజా మంటలు)
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని పొలంలో వరి నారుతో చాటి చెప్పిఅందరికి ఆదర్శంగా నిలిచారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి....
శోభారాణి ప్రతి సారి తన పొలంలో కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి పేర్లను పొలంలో తానే స్వయంగా వరి నారుతో రాస్తూ కాంగ్రెస్ పార్టిలోని నాయకులపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి మాజీ సర్పంచ్, పెగడపల్లి మాజి జడ్పిటీసి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ కార్యదర్శి తాటిపర్తి శోభారాణి శనివారం వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేస్తుండగా తన ఆలోచనకు పదునుపెట్టి ప్రతి ఏడు లాగానే ఈ సారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును వరి నారుతో ప్రదర్శించి రైతుల పక్షపాతి సీఎం అని చాటిచెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా శోభారాణి మాట్లాడుతూ.....
- తెలంగాణలో ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా పిదప మహిళాలకు ఉచిత రవాణా సౌకర్యం , నూతన ఉద్యోగాల నియామకాలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500 లకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
- రాష్ట్రన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సీ ఎం ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేయడానికే తాను పొలంలో రేవంత్ రెడ్డి పేరును ప్రదర్శించానని శోభారాణి తెలిపారు.
శోభారాణిని కాంగ్రెస్ శ్రేణులతో పాటు, ప్రజలు నేటిజన్లు అభినందించారు.