ధర్మపురి సింగిల్ విండోలో కోటి రూపాయల నిధులు అవకతవకలు - ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ధర్మపురి సింగిల్ విండో ) లో ₹1,24,30,688 /- (కోటి ఇరువది నాలుగు లక్షల 30 వేల ఆరు వందల ఎనబైఎనమిదిరూపాయలు) నిధుల అవకతవకలు, విచారణ- తగు చర్యల నిమిత్తం జే. సురేందర్ కుమార్, S/O ఆర్. జె.శర్మ. గ్రామం ధర్మపురి, జగిత్యాల జిల్లా, ధర్మపురి సింగిల్ విండో సభ్యుడి ని (సొసైటీ సభ్యత్వం సంఖ్య 857) సోమవారం కలెక్టర్ ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ధర్మపురి సింగల్ విండో సొసైటీ లో ₹1, 24, 30, 688 /- (కోటి ఇరువది నాలుగు లక్షల ముప్పది వేల ఆరువందల యెసుబై యెనిమిది రూపాయలు) నిధుల అవకతవకలు, జరిగినట్టు నిర్ధారిస్తూ సంబంధిత జిల్లా సహకార సంఘం అధికారి, ధర్మపురి సింగిల్ విండో అధ్యక్ష కార్యదర్శులకు, పాలకవర్గానికి గత సంవత్సరం సంజాయిషి నోటీసు జారీ చేశారు.
తమరు పైన పేర్కొన్న విషయంలో ప్రజాధనాన్ని రక్షించడంలో తగు చర్యలు చేపట్టాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.