పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సారంగాపూర్ జనవరి 6 (ప్రజా మంటలు) :
మండలం లోని నాగునూర్ గ్రామంలో 20లక్షల నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
అనంతరం గ్రామానికి చెందిన నక్కలపెట రవీందర్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం కాగా ఇంటిని పరిశీలించి,ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఇస్తామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO జైపాల్ రెడ్డి,ప్యాక్స్ ఛైర్మెన్ లు నరసింహరెడ్డి,మల్లారెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ బాపి రాజు,మెడికల్ ఆఫీసర్ రాధ,మండల,గ్రామ నాయకులు గుర్రాల రాజేందర్ రెడ్డి,మనోహర్ రెడ్డి,సొల్లు సురేందర్,సుధాకర్ రావు,రవీందర్ రావు,శేఖర్ గౌడ్,దామోదర్ రావు,రమణ రావు,వెంకటేష్,లక్ష్మి రాజం,గంగాధర్,మహేష్, శంకర్,నవీన్,MPDO గంగాధర్,AE రాజ మల్లయ్య,ఆశా వర్కర్లు,ఆరోగ్య సిబ్బంది,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.