అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ * స్వర్ణలత జ్ఞాపకార్థంగా నిర్మాణం
అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ
* స్వర్ణలత జ్ఞాపకార్థంగా నిర్మాణం
సికింద్రాబాద్ డిసెంబర్ 12 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి కంటోన్మెంట్ చెందిన కే.నందకుమార్ ముందుకు వచ్చారు. ఈ మేరకు తన సతీమణి (పూర్వ విద్యార్థి) స్వర్ణలత జ్ఞాపకార్థం రూ.20 లక్షలతో రెండు తరగతి గదుల నిర్మాణానికి గురువారం పాఠశాల ఆవరణలో వేదపండితుల మంత్రోశ్చరణాల మద్య భూమిపూజ నిర్వహించారు. కే. స్వర్ణలత 1970 సంవత్సరంలో ఇదే పాఠశాలలో పదవతరగతి చదివారని, ఆ తర్వాత డిగ్రీ, పీజీ చేశారని పాఠశాల టీచర్లు గుర్తు చేశారు. టీచర్ గా పనిచేసిన స్వర్ణలత ఎందరికో విద్యాబుద్దులు నేర్పి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారని స్మరించుకున్నారు. ఇలాంటి విద్యా వేత్తలు,పరోపకారులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. స్వర్ణలత పేరున ఆమె చదువుకున్న పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మించడానికి ముందుకు వచ్చిన ఆమె భర్త కే.నందకుమార్ సేవా భావం ఆదర్శనీయమని అభినందించారు. హెడ్మాస్టర్ స్వరూప, ఇంచార్జీ కృష్ణమూర్తి, టీచర్లు ఉదయ్ కుమారి జ్యోతి పద్మప్రియ ప్రమోద్ దామోదర్ లక్ష్మి కుమారి గీతాంజలి అరుణకుమారి, సైదులు, మంజుశ్రీ, విజయ భాస్కర్, దీప, సతీష్, చంద్రిక, నవ్య, సిబ్బంది, బ్రహ్మాశ్రీ జ్యోతిష్య వాస్తు శాస్ర్త పండితులు హేమంత్ శర్మ పాల్గొన్నారు.