ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా..మీ అమ్మ, నాన్నను చంపేస్తా..
On
ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా..మీ అమ్మ, నాన్నను చంపేస్తా..
మాజీ స్నేహితుని బెదిరింపులు
హైదరాబాద్ నవంబర్ 16:
హైదరాబాద్ హయత్ నగర్ లో యువతిపై లైంగిక వేధింపులకు ఒదిగడుతున్న మాజీ స్నేహితునిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గతంలో విజయ్ తో స్నేహం చేసిన యువతి, తనను విజయ్ బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది.
అనేక సార్లు యువతిని బ్లాక్ మెయిల్ చేసి విజయ్, డబ్బులు వసూలు చేసినట్లు యువతి తెలిపింది.గతంలో స్నేహంగా ఉన్న సమయంలో తీసుకొన్న ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పెడతానని బెదిరిస్తున్నారని తెలిపింది
విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయారని బాధితురాలు తెలిపింది.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ పై యువతి ఫిర్యాదు చేసింది.
Tags