పట్ట భద్రుల ఉపాధ్యాయ ఎన్నికలలో అన్ని పార్టీలు బీసీలకే కేటాయించాలి - బిసి సంక్షేమ సంఘం డిమాండ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..... త్వరలో జరిగే పట్టభద్రులు-ఉపాధ్యాయ నియోజవర్గాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు బిసి అభ్యర్థులకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
గత అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు అర్థబలం, అంగ బలం అంటూ అగ్రకులాలకు కేటాయించారు.
అన్ని పార్టీలు అదే పనిగా బీసీలకు అన్యాయం చేస్తూ పోతే సహించేది లేదని అన్నారు.
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ జనాభా ప్రకారము సామాజిక వర్గానికి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలన్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు బి.సి. జనాభా లెక్కలు సేకరించాలని 40 సం.రాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం బి.సి జనాభా లెక్కలు తీయకుండా అన్యాయం చేస్తుందని విమర్శించారు.
ఎస్సీ /ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి. జనాభా లెక్కలలో బి.సి. కులాల వారిగా లెక్కలు సేకరించాలని కోరారు. ఈ డిమాండ్లపై జాతీయ స్థాయి ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బండపెల్లి నర్సయ్య, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.