తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అరెస్ట్
- వైరల్ అవుతున్న తండ్రి సలహా
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అరెస్ట్ - వైరల్ అవుతున్న తండ్రి సలహా
చెన్నయ్ డిసెంబర్ 04:
డ్రగ్స్ కేసులో అరెస్టయిన తన కుమారుడికి నటుడు మన్సూర్ అలీఖాన్ ఇచ్చిన సలహా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మన్సూర్ అలీఖాన్ కొడుకు వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
మన్సూర్ వ్యాను దగ్గర ఆపి జైలుకు వెళ్లే ముందు కొడుకుకు 'ఎందుకు తప్పు చేసావు, అని సలహా ఇచ్చాడు ఇటీవలే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమిళ చిత్రసీమలో ఓ నిర్మాత అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మన్సూర్ అలీఖాన్ కొడుకు కూడా డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. - ఇప్పుడు అతని వయస్సు 26 సంవత్సరాలు.
చెన్నైలోని నుంగంబాక్కంలోని అతని ఇంటి నుంచి పోలీసులు తులక్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జేజే నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ స్థితిలో పోలీసులు తన కుమారుడిని వ్యాన్‌లో జైలుకు తీసుకెళ్లగా.. మన్సూర్ అలీఖాన్ తప్పులు చేయడం ఎందుకు, ధైర్యంగా ఉండు, తెలివిగా ఉండమని సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది.
దీంతో అక్కడక్కడా డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు కూడా పట్టుబడుతున్నాయి. ఇటీవలే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమిళ చిత్రసీమలో ఓ నిర్మాత అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మన్సూర్ అలీఖాన్ కొడుకు కూడా డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఇటీవల చెన్నైలోని ముకప్పర్ ప్రాంతంలోని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు సెల్ ఫోన్ యాప్స్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. దీన్ని పసిగట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గత నెలలో కొందరు కాలేజీ విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ కేసులో మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు అలీ ఖాన్ దులక్ ప్రమేయం ఉంది.