నటి కస్తూరి శంకర్ అరెస్ట్ - చెన్నైకు తరలింపు
నటి కస్తూరి శంకర్ అరెస్ట్ - చెన్నైకు తరలింపు
హైదరాబాద్ నవంబర్ 16 :
చెన్నై ఎగ్మోర్ పోలీసుల ప్రత్యేక బృందం శనివారం (నవంబర్ 16) రాత్రి 8.30కి, సైబరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నటి కస్తూరి శంకర్‌ను అరెస్టు చేసింది.
అరెస్టును ధృవీకరిస్తూ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ, నవంబర్ 16 న ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ నుండి ఒక బృందం హైదరాబాద్ వచ్చి, నార్సింగిలోని ఆమె ఫ్లాట్ నుండి నటిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
"ఆమెపై 2023 BNS చట్టంలోని సెక్షన్లు 191 మరియు 192 కింద కేసు నమోదు చేయబడింది. బృందం ఆమెను రాత్రి 8.30 గంటలకు అరెస్టు చేసింది. మరియు ట్రాన్సిట్ వారెంట్‌పై ఆమెను చెన్నైకి తీసుకెళ్తానమని ” అధికారి చెప్పారు.
నేపథ్యం:
ఇటీవల చెన్నై లో జరిగిన బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసిన సమావేశంలో నటి కస్తూరి శంకరన్ మాట్లాడుతూ,తమిళనాట రాజుల అంతఃపురంలో పనిచేయడానికి తెలుగువారు దాస్యులుగా వచ్చారని, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పొగుడుతూ, ఇతర వర్గాలను కించపరుస్తూ మాట్లాడారు. ఈమె వ్యాఖ్యలపై తమిళనాట తీవ్ర నిరసన వ్యక్తం అయింది.
తెలుగు, తమిళ ప్రజల నిరసనలతో, నటి కస్తూరి శంకరన్ ఇదివరకే బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ విషయంపై ఆమె అనేక తెలుగు యూట్యూబ్ ఛానళ్లలో వివరణ ఇచ్చారు. తెలుగు అనే పడం వాడడం తప్పేనని, తనకు తెలుగు వారంటే ఎంతో గౌరమని, తన కొడుకును ఇక్కడే చదివిస్తున్నానని చెప్పారు.