రైతులు పొలాల వద్ద స్టార్టర్లు, ఫీజుల నాణ్యత చూసుకోవాలి. ఎన్‌ పిడీసిఎల్‌ జగిత్యాల ఎస్‌ఇ సాలీయా నాయక్‌

On
రైతులు పొలాల వద్ద స్టార్టర్లు, ఫీజుల నాణ్యత చూసుకోవాలి. ఎన్‌ పిడీసిఎల్‌ జగిత్యాల ఎస్‌ఇ సాలీయా నాయక్‌

రైతులు పొలాల వద్ద స్టార్టర్లు, ఫీజుల నాణ్యత చూసుకోవాలి.

ఎన్‌ పిడీసిఎల్‌ జగిత్యాల ఎస్‌ఇ సాలీయా నాయక్‌

కోరుట్ల అక్టోబర్‌ 26 (ప్రజా మంటలు) :

రైతులు పొలాల వద్ద స్టార్టర్లు, ఫీజులు, స్టార్ట్‌ డబ్బా నాణ్యత ఉండేలా చూసుకోవాలని, ఎన్‌ పిడీసిఎల్‌ జగిత్యాల ఎస్‌ఇ సాలీయా నాయక్‌ సూచించారు. మేడిపల్లి, బీమారం మండల్లాల్లోని కాచారం,  వెంకట్రావుపేట్‌ గ్రామాల్లో

‘‘పొలం బాట’’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎస్‌ఇ సాలీయా నాయక్‌ మాట్లాడుతూ రైతులు పొలాల వద్ద స్టార్టర్లు, ఫీజులు, స్టార్ట్‌ డబ్బాలు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలన్నారు.

లో ఓల్టేజి సమస్య రాకుండా ప్రతి రైతులు కెపాసిటర్‌ లను అమర్చుకోవడం తప్పనిసరి అని సూచించారు. విద్యుత్‌  సమస్యలుంటే అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని తెలిపారు. రైతులు, నోరులేని మూగజీవాలు విద్యుత్‌ ప్రమాదాలకు గురి కాకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే అధికారులకు తెలపాలన్నారు. గ్రామాలకు నాణ్యమైన సేవలు అందించే విద్యుత్‌ సిబ్బందిని ఎస్‌ఇ అభినందించారు.

ఈ కార్యక్రమంలో మెటుపల్లి  డిఈ గంగారాం,కోరుట్ల రూరల్‌ ఏడిఈ రఘుపతి,ఏఈ అశోక్‌ , ఏఈ అర్జున్‌ , సబ్‌ ఇంజనీర్‌ ఎక్కల్‌ దేవి హరిప్రసాద్‌ , మన్నెగూడెం , మేడిపల్లి సెక్షన్‌ విద్యుత్‌ సిబ్బంది, గ్రామాల ప్రజలు , రైతులు పాల్గొన్నారు.

Tags