మార గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
కాంగ్రెస్ నాయకుణ్ణి కోల్పోవడం బాధాకరం
కాంగ్రెస్ నాయకుణ్ణి కోల్పోవడం బాధాకరం
మార గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
జగిత్యల అక్టోబర్ 28:
కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీదర్ బాబు. కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి మరణం పార్టీకి, జీవన్ రెడ్డికి తీరని లోటని అన్నారు. హత్యకు గల కారణాలను వెలికి తీసి హంతకులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అణామి ఇచ్చారు.
జగిత్యాల జిల్లాలలోని జాబితాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుణ్ణి కోల్పోవడం దురాదృష్టకరమని, ఎన్నో ఏళ్లుగా పార్టీకి విధేయులుగా ఉన్న గంగారెడ్డి హత్యపై పూర్తి విచారణ జరిపించి, నేరస్తులను పట్టుకోని తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మాజీ ఎంపిటిసి మారు గంగారెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరమర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ,జీవన్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మఖ్ఖాన్ సింగ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ తదితరులు ఉన్నారు.
-----------------