ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యం లో మెగా వైద్య శిబిరం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963348493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు) :
పట్టణములోని దేవిశ్రీ గార్డెన్స్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పారిశుధ్య కార్మికులకు మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ....
పారిశుద్య కార్మికులు సమాజం లో అంతర్భాగం అన్నారు.పారిశుద్య కార్మికులు పై సమాజం లో చిన్న చూపు వద్దన్నారు.కార్మికుల వల్లనే పట్టణం పచ్చదనం, పారిశుధ్యం, పరిశుభ్రంగా ఉందన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ మెగా వైద్య శిబిరం అభినందనీయం..ఉచిత పరీక్షలు, మందులు అందించడం సంతోషం అన్నారు.
వైద్య పరీక్షల్లో ఏమైనా వ్యాధులను గుర్తిస్తే వారికి ఐ ఎం ఏ మరియు ప్రభుత్వ పరంగా ఆదుకుంటా అని కార్మికులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, డి ఎం హెచ్ ఓ డా. సమీయొద్దీన్,ఐ ఎం ఎ అధ్యక్షులు జి.హేమంత్ ,ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్,కోశాధికారి డా.సుధీర్ కుమార్,స్థానిక కౌన్సిలర్ క్యాధాసు నవీన్,మెప్మ ఏ ఓ.శ్రీనివాస్,డా.శంకర్,డా.రామకృష్ణ,కౌన్సిలర్ లు చుక్క నవీన్,అల్లే గంగసాగర్, నాయకులు కోలగాని సత్యం,శరత్ రావు,దాసరి ప్రవీణ్,చెట్పల్లి సుధాకర్, ప్రభాత్ సింగ్ ఠాగూర్, వైద్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.